నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం, (ఇబ్రహీంపట్నం) ఫిబ్రవరి 10: మైలవరం మాజీశాసనసభ్యులు, మాజీమంత్రి చనమోలు వెంకట్రావు 91వ జయంతి వేడుకలు శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తగా ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో చనమోలు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి తరం పెద్దమనిషి, నేటి తరానికి స్ఫూర్తిప్రదాతగా చనమోలు వెంకట్రావు ప్రసిద్ధికెక్కారని కొనియాడారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి దివంగత నేత చనమోలు వెంకట్రావు పునాదులు వేశారన్నారు. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.