తాడేపల్లి,అక్టోబర్ 28 (ఆంధ్రపత్రిక): తాడేపల్లి,అక్టోబర్ 28 (ఆంధ్రపత్రిక):ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. తాజాగా పెంచిన చికిత్సలతో ఆరోగ్య శ్రీ పథకం కింద 3,255 చికిత్సలను అందిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పోలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అదనంగా 2,196 వైద్య చికిత్సలను అదనంగా చేర్చినట్లు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ నూతన చికత్సలను ఆరోగ్య పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఆరోగ్య శ్రీ కింద 1059 చికిత్సలు అందిస్తుందడగా వాటిని తమ ప్రభుత్వంలో 3,255కు పెంచినట్లు వివరించారు. మే 2019 నాటికి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా జనవరి 2020లో 2059 పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. జులై 2020లో 2200, నవంబర్ 2020లో 2436, జూన్ 2021లో 2446కు, 2022లో 3255 కు పెంచిమన్నారు. చంద్రబాబు హయాంలో 2018%–%19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!