న్యూఢల్లీి, సెప్టెంబరు 24 (ఆంధ్రపత్రిక) : భారతదేశంలో మొబైల్ నెట్ వర్క్‌లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5జీ ప్రారంభానికి డేట్ పిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో 5జీ సేవలు ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు మరింత మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించ నున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢల్లీి, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై మరియు పూణే నగరాల్లో తొలుత 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. వీటి తరువాత దశల వారీగా దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ సేవలను విస్తరించనున్నారు. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ 5జీ సేవలను ప్రారంభిస్తారని జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ఈరోజు ట్వీట్ చేసింది. భారతదేశం డిజిటల్ పరివర్తన, కనెక్టవిటీ కొత్త శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రధాని నరేంద్రమోదీ 5జీ సేవలను ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు అని ట్వీట్ చేసంది. ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీకి సంబంధించి ఇండియా మొబైల్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. భారత్‌తో 5జీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2023-2040 మధ్యకాలంలో ఇండియా ఎకానమీకి రూ.36.4 ట్రిలియన్ల మేలు జరిగే అవకాశం ఉందని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఇండస్ట్రీ బాడీ ఇటీవలి నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి మొత్తం కనెక్షన్లలో 5జీ వాటా మూడవ వంతకు చేరుకుంటుదని.. 2జీ, 3జీ 10 శాతం కన్నా తగ్గిపోతుందని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ నివేదిక పేర్కొంది. తయారీ రంగంలో 20 శాతం, రిటైల్ రంగంలో 12 శాతం, వ్యవసాయం 11 శాతం వరకు 5జీ సేవల వల్ల లాభపడుతాయని అంచానా వేసింది. ప్రస్తుతం ఉన్న 4జీ కన్నా 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని 5జీలో పొందవచ్చు. 5జీ వేగం 10 జీబీపీఎస్ వరకు ఉంటుంది. అదే 4జీ వేగం 100 ఎంబీపీఎస్ వరకు మాత్రమే ఉంది. 5 స్పెక్ట్రమ్ వేలంలో దేశంలోని జియో, భారత్ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్‌లు 5జీ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్నాయి.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!