IPL 2023 : మార్చి 31 నుంచి మే 28 వరకు 12 వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ ఆరంభానికి వారం రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కూడా సన్నాహక శిబిరాలతో బిజీ బిజీగా గడుపుతున్నాయి. ఈ ఏడాది టోర్నీ పాత పద్దతిలో (హోం, అవే) జరగనుంది.మార్చి 31 నుంచి మే 28 వరకు 12 వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.ఇక గత రెండు సీజన్లలోనూ నిరాశ పరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి రెచ్చిపోయి ఆడాలని పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వంలో సత్తా చాటాలని సన్ రైజర్స్ పట్టుదలగా ఉంది.ఇక టోర్నీలో సన్ రైజర్స్ 5+4+2 ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అంటే 5గురు బ్యాటర్లు (వికెట్ కీపర్ తో కలిపి).. నలుగురు బౌలర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లతో టోర్నీలో బరిలోకి దిగే అవకాశం ఉంది.బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు ఉంటారు. అనంతరం రాహుల్ త్రిపాఠి, బ్రూక్, క్లాసెన్ లు బ్యాటర్లుగా ఉంటారు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్ లు ఆల్ రౌండర్లుగా ఉంటారు.ఇక బౌలింగ్ విషయంలో ముగ్గురు సీమర్లు.. ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ల స్థానాలు ఖాయం. ఇక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ వ్యవహరించే అవకాశం ఉంది.వాషింగ్టన్ సుందర్, మార్క్రమ్ లు స్పిన్నర్లుగా మంచి ప్రదర్శన చేస్తే.. రషీద్ స్థానంలో మరో బ్యాటర్ కు అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అబ్దుల్ సమద్ వ్యవహరించే అవకాశం ఉంది.సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తే అబ్దుల్ సమద్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండే అవకాశం ఉంది. సన్ రైజర్స్ బౌలింగ్ చేసే సమయంలో సమద్ స్థానంలో నటరాజన్ లేదా ఉమ్రాన్ మాలిక్ లు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ద్వారా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!