100 ప్రైవేట్ లాకర్లు.. 500 కోట్ల నల్ల డబ్బు.. 50 కిలోల బంగారం.. ఒకేచోట దొరికితే.. అదీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా. రాజస్థాన్‌లో ఇదే ఇప్పుడు సంచలన వార్త. కానీ.. ఈ సొత్తు మొత్తం ఎవ్వరిది అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనేది సమాధానం. ఇంతకీ జైపూర్‌లో ఈ లాకర్ల మిస్టరీ ఏంటి.. దాని వెనక ఎవరున్నారు? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రాజస్థాన్‌లో బీజేపీ ఎంపీ కిరోడీ లాల్ మీనా. ఈయనేం చేసినా వెరైటీయే.
100 ప్రైవేట్ లాకర్లు.. 500 కోట్ల నల్ల డబ్బు.. 50 కిలోల బంగారం.. ఒకేచోట దొరికితే.. అదీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా. రాజస్థాన్‌లో ఇదే ఇప్పుడు సంచలన వార్త. కానీ.. ఈ సొత్తు మొత్తం ఎవ్వరిది అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనేది సమాధానం. ఇంతకీ జైపూర్‌లో ఈ లాకర్ల మిస్టరీ ఏంటి.. దాని వెనక ఎవరున్నారు? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రాజస్థాన్‌లో బీజేపీ ఎంపీ కిరోడీ లాల్ మీనా. ఈయనేం చేసినా వెరైటీయే. పాపులారిటీ కోసం అప్పుడప్పుడూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జైపూర్‌లో ఒకసారి ఓవరాక్షన్ చేసి అరెస్టయ్యారు కూడా. లేటెస్ట్గా ఆయన చేసిన మరో స్టంట్.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.
జైపూర్‌లోని ఒక కమర్షియల్ ఏరియాలోని గణపతి ప్లాజా.. అందులో ప్రైవేట్ బ్యాంకు నిర్వహిస్తున్న సేఫ్ లాకర్లలో 500 కోట్ల నల్లడబ్బు మూగుతోందట. 50 కిలోల బంగారం కూడా ఉందట. రండి.. వచ్చి తాళాలు పగలగొట్టండి.. లాకర్లు తెరవండి అంటూ పోలీసులకు బంపరాఫర్ ఇచ్చారు ఎంపీ కిరోడీ లాల్ మీనా. ముందు మనం వెళదాం పద అంటూ మీడియాను వెంటబెట్టుకుని వెళ్లి సదరు లాకర్లను చూపించి అక్కడే తిష్ట వేశారు ఎంపీ.
ఇంతకీ ఈ రహస్య బీరువాల్లో ఉండే సొత్తంతా ఎవ్వరిదయ్యా అంటే.. ఆ పేర్లు నేను బైటపెడితే రాజకీయ పలుకుబడితో వాళ్లు తప్పించుకుంటారు అని దాగుడుమూతలు మొదలుపెట్టారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెద్దమనిషి చెప్పిన మాటల్ని సీరియస్‌గా తీసుకున్నట్టు లేదు. పోలీసుల నుంచి కూడా ఎటువంటి రియాక్షనూ లేదు. వచ్చేనెల 23న రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరోడీ లాల్ చేసిన హడావిడి ప్రాధాన్యం సంతరించుకుంది.
కిరోడీ లాల్ మీనా.. 2008 వరకూ బీజేపీలో ఉన్నారు. తర్వాత రామ్రామ్ కొట్టి పదేళ్లయ్యాక మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి 2018లో మళ్లీ అదే బీజేపీలో వచ్చి చేరారు. తర్వాత ఎంపీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సవాయి మాధోపూర్ నుంచి బరిలో ఉన్న కిరోడీ లాల్ మీనా.. లాకర్ల సబ్జెక్ట్‌తో రాజస్థాన్‌లో మళ్లీ సెన్సేషన్ సృష్టిస్తున్నారు.