– కూలీల పేరుతో దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు
– ఎన్ ఆర్ జి ఎస్ అధికారుల చేతివాటం
విడవలూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రపత్రిక) : మహాత్మ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతో ప్రతిష్టాత్మగా ప్రతి కుటుంబానికి జాబు కార్డులతో పాటు కనీస వేతనం వచ్చే విధంగా ఏర్పడింది. మండలం ఊటుకూరు గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్నాయి అయితే ఫీల్డ్ అసిస్టెంట్లు వారికి అనుకూలం ఉన్నవారికి జాబ్ కార్డు ఇప్పించడం, కూలి పనులకు వెళ్ళని వారి పేర్లు మాస్టర్లో నమోదు చేయడం , మేటు దగ్గర ఉండవలసిన మాస్టర్ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉండడం గమనార్హం, ఇది ఇలా ఉండగా ఐదు మంది కూలీలతో ఉపాధి పనులు జరిపిస్తూ పదిమంది కూలీలు వచ్చినట్లుగా మాస్టర్ లో నమోదు చేయడం అక్కడ పని చేస్తున్న కూలీలను ఆశ్చర్యం కలిగించింది. మేటు దగ్గర మాస్టర్ బదులు నోట్ బుక్ ఏర్పాటుచేసి అందులో పేర్లు నమోదు చేయడం విశేషం మండల ఎన్ ఆర్ జి ఎస్ అధికారుల సాహారంతో అవినీతి పథంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దూసుకుపోతున్నారు. ఈ అవినీతి అక్రమాలు బయటపడతాయి సామాజిక తనిఖీల్లో అనుకుంటే వారిని కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు పక్కదారి పట్టిస్తూ చాలా మనవుతున్నారు. కోట్ల రూపాయలు పనులు జరుగుతాయి వాటిలో ఎవరికి చెందవలసిన వాటాలు వారికి చెందడం సహజమైపోయింది. జిల్లా ఇతర జిల్లాల అధికారులు ఎవరొచ్చినా సరే విడవలూరు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వారిని వాళ్లదారికి తెచ్చుకుంటారు.అధికారులు చొరవ చూపితే కూలీల పేరుతో అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్అసిస్టెంట్లు గుట్టు రట్టు అవుతుందని మండల ప్రజలు కోరుతున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!