రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా పెద్ద సంచలనం. అంతలా ఇతగాడు సుదీర్ఘ కాలంగా తనదైన హవాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్నాడు.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అదిరిపోయే చిత్రాలతో వస్తున్నాడు. ఇలా ఇటీవలే ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా ఊహించని విధంగా లభిస్తోంది. అందుకు తగ్గట్లుగానే భారీ కలెక్షన్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘కల్కి 2898 ఏడీ’ 14 రోజుల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
కల్కిగా కనిపించిన స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ మూవీనే ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.
ప్రభాస్ బిజినెస్ ఇలా
ప్రభాస్ హీరోగా చేసిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.
14వ రోజు ఇలా.. టోటల్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా 14వ రోజు ఈ చిత్రం డౌన్ అయినా మంచి రెస్పాన్స్‌నే అందుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 4.80 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు వారాల్లోనే రూ. 451 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసుకుంది.