గాజా: గాజా అంతటా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 27 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆల్ జజీరా వెబ్ సైట్ పేర్కొంది. దక్షిణ భూభాగంలోని ఖాన్ యూనిస్ మరియు రఫా చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
గాజాలోకి ప్రవేశించడానికి వాణిజ్య కార్గో ట్రక్కులను వినియోగిస్తున్న వ్యక్తుల సమూహంపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది మరణించారు. గాయపడిన వారిని దక్షిణాన ఉన్న చివరి ప్రధాన వైద్య సదుపాయం గల నాజర్ ఆసుపత్రికి తరలించారు.