పాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు మంత్రి రోజా
తిరుమల,అక్టోబరు10(ఆంధ్రపత్రిక): టీడీపీ నేతలు తొడలు కొట్టుకుంటూ.. ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టించేందుకు యాత్రలు చేస్తున్నారన్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. హైదరాబాద్ అనుభవంతో మూడు రాజధానులు ముద్దు అని అన్నారు. అభివృద్ది ఒకే దగ్గర కేంద్రీకృతం కావడం సరికాదన్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో మంత్రి ఆర్కే రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ జనం కోసం పోరాడరని.. కేవలం టీడీపీ, బీజేపీ కోసమే పని చేస్తారని చెప్పారు. ఇంతకు ముందు కూడా మంత్రి రోజా… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పలు ఆరోపణలు చేశారు. పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసమేనన్న ఆయన…. 2019 ఎన్నికల్లో పవన్‌ను రాష్ట్ర ప్రజలు రెండు చోట్ల ఓడిరచారన్నారు. 2024 ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని చెప్పారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమన్న రోజా.. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైసీపీకి వస్తుందని ఆమె తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా తెలిపారు.