రఘునాథపల్లి స్టేషన్ ముందు షర్మిల మెరుపు సమ్మె
కరెంట్ ఎప్పుడు వస్తదో రైతుకు కూడా తెలియడం లేదు
రైతులకు వాస్తవ స్థితి అంతా తెలుసు
జనగామ,ఫిబ్రవరి10 (ఆంధ్రపత్రిక): వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ శుక్రవారం ఉదయం రఘునాథ్‌పల్లి సబ్‌స్టేషన్ ఎదుట షర్మిల మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలు లేకుండా పాలన అని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. అమెరికాలో అయినా కరెంట్ కోతలు ఉంటాయట.. తెలంగాణలో మాత్రం ఉండవట. 24 గంటలు క్షణం కూడా పోకుండా కరెంట్ ఇస్తున్నారట అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటలు ఇస్తున్నాం కాబట్టి అధికారంలో ఉంటామని చెప్తున్నారన్నారు. దొంగ మాటలు చెప్తుంది కేసీఆర్దొంగల ముఠా అని విమర్శించారు. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలంగాణ రైతాంగానికి అంతా తెలుసన్నారు. రైతులకు వాస్తవ స్థితి అంతా తెలుసన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తదో రైతుకు కూడా తెలియడం లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.