హైదరాబాద్,ఆగస్ట్16(ఆర్‌ఎన్‌ఎ): గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా 2047 కోసం ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. రానున్న 25 ఏళ్లలో ఆ టార్గెట్లను అందుకోవాలన్నారు.
అయితే ప్రధాని మోదీ విధించిన ఆ లక్ష్యాలు గొప్పగానే ఉన్నాయని, కానీ 2022 ఆగస్టు 15 నాటికి చేరుకోవాలన్న లక్ష్యాల గురించి ప్రధాని పట్టించుకోవడంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని గతంలో చేసిన వాగ్దానాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
క్యా హువా తేరా వాదా అన్న హ్యాష్‌ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్ ఓ ఫోటోను అప్లోడ్ చేశారు. దాంట్లో మోదీ గతంలో చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు. 2022 నాటికి ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామన్నారని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుస్తామని, ప్రతి ఇంటికీ కరెంటు సరఫరా చేస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని, కానీ ఏ ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. విూ లక్ష్యాలను విూరు గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎక్కడ ఉంటుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. విూ వైఫల్యాలను విూరే గుర్తించలేకపోతున్నారని విమర్శించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!