మహాత్మా జ్యోతి రావు పూలే 196 వ జయంతి
Andhrapatrika మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం పంచాయతీ కార్యాలయము వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే 196 జయంతి వేడుకలు ఘనంగా మంగళవారం సాయంత్రం నిర్వహించారు. పూలే విగ్రహానికి మొగల్తూరు గ్రామ సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు గ్రామ ఉపసర్పంచ్ బోనం నరసింహ రావు పంచాయతీ వార్డు మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.