కె.కోటపాడు,ఫిబ్రవరి15(ఆంధ్రపత్రిక):మండలంలోని మేడిచర్ల గ్రామంలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లిఖార్జున స్వామివారి ఆలయం 16వ వార్షికోత్సవం ఈ నెల16న ఘనంగా నిర్వహించనున్నట్టు వార్షికోత్సవ నిర్వాకసారధులు పూడి నారాయణమూర్తి, పూడి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం స్వామివారికి, అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తామన్నారు. మధ్యాహ్నం 12గంటలకు సుమారు మూడు వేలమందికి నిర్వహించనున్న అన్నసమారాధనలో భక్తులు పాల్గొని అన్న, ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.2గంటలనుండి గుర్రపు పరుగుల ప్రదర్శనలు నిర్వహించి గ్రామస్థులు పలువురిఆర్ధిక సాయంతో ప్రధమ బహుమతి రూ.12,000లు నుంచి రూ.1,000ల వరకూ ఏడు బహుమతులను విజేత గుర్రాల యజమానులకు అందచేస్తామని వారు వివరించారు.రాత్రి 7గంటల నుండి మేడిచర్ల యూత్ ఆధ్వర్యంలో వినోద కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పూడి నారాయణమూర్తి, పూడి శ్రీనివాసరావు చెప్పారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!