గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాల మీదకు తీసుకొస్తాయి! సైలెంట్ కిల్లర్ వ్యాధులు
మారుతున్న జీవన వాతావరణం వల్ల ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా అనారోగ్యం పాలవుతున్నారు.. నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకునే వారే కనిపించని పరిస్థిని నెలకొందిలక్షణాలు కనిపించని కొన్ని వ్యాధులు ఉంటాయి. వీటిని సైలెంట్ కిల్లర్ వ్యాధులు అంటారు. సైలెంట్ కిల్లర్ వ్యాధులలో ఎలాంటి లక్షణాలు కనిపించవు లేదా చాలా తక్కువ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.సరైన సమయంలో చికిత్స పొందకపోతే, అది ప్రాణాంతకం లేదా ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వచ్చే కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధులు ఉన్నాయి. ఇందులో స్లీప్ అప్నియా, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు మొదలైనవి ఉన్నాయి. పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధుల గురించి తెలుసుకోండి.రక్తహీనత- శరీరంలో ఐరన్ లోపించడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంటుంది. రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో వైద్యుడిచే పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.అండాశయ క్యాన్సర్- అండాశయాలలో ఏర్పడే కణాలు వేగంగా పెరగడాన్ని అండాశయ క్యాన్సర్ సూచిస్తుందని డాక్టర్ కప్తాన్ సింగ్ తెలిపారు. ఈ వ్యాధి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక మిలియన్ మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా ప్రారంభ దశలలో ఎలాంటి లక్షణాలను కలిగి ఉండదు . అండాశయ క్యాన్సర్ లక్షణాలు అలసట, వెన్నునొప్పి, మలబద్ధకం, తరచుగా మూత్రవిసర్జన, ఉబ్బరం, వేగంగా బరువు తగ్గడం.అధిక రక్తపోటు- అధిక రక్తపోటు… ఇది గుండెపోటు, స్ట్రోక్.. ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ కప్తాన్ సింగ్ చెప్పారు. అధిక రక్తపోటు నివారణలో ధూమపానం చేయకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వంటివి ఉన్నాయి.50 ఏళ్ల తర్వాత మహిళల్లో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. మీరు అధిక బరువుతో ఉన్నప్పుడు, ధూమపానం లేదా పొగాకు వాడటం, ఎక్కువ ఉప్పు తినడం, తగినంత పొటాషియం తీసుకోకపోవడం లేదా ఎక్కువ ఆల్కహాల్ తాగడం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది