నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): ఈనెల 15 నుండి డిసెంబర్ 5 వరకు జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే ప్రగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఢల్లీి రావు. జాతీయ కుష్టు వ్యాధి నివారణలో బాగంగా ఇంటింటి గుర్తింపు సర్వే కార్యక్రమం ఈనెల 15 నుండి డిసెంబర్ 5 వరకు జిల్లాలో ప్రగడ్బందీగా నిర్వహించాలని ఎన్.ఎల్.ఈ.పి. జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్ లో శనివారం జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించిన సర్వే నిర్వహణపై జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ డిల్లీ రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 15 నుండి డిసెంబర్ 5 వరకు సచివాలయ వాలంటీర్ల సహకారంతో ఆశాలు, అంగన్వాడీలు, ఏ.ఎన్.ఎం లు, వైద్యులు ఇంటింటి సర్వేను ప్రణాళికా బద్దంగా చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలలోను సర్వే చేపట్టాలని సూచించారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, పొడలు, నరాల ఉబ్బు, కాళ్లు, చేతుల కండరాల బలహీనత, తిమ్మిర్లు, కళ్ళు పూర్తిగా మూసుకోలేక పోవడం, చెవి తమ్మెలు మందంగా మారడం, బుడిపెలు వంటివి ఉండటం, వ్యాధికారక లక్షణాలు కావచ్చని వీటిని గుర్తించి వైద్యపరీక్షలు జరిపాలన్నారు. వారంలోపు వ్యాధి లక్షణాలు అదేవిధంగా ఉన్నట్లయితే చికిత్స ప్రారంబించాలని ఈ వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లేప్రే అనే సూక్ష్మక్రిమి వలన కుష్టు వ్యాధికి కారణమనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని, సర్వేను ఐ.సి.డి.ఎస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, సాంఘిక సంక్షేమ శాఖలు సంయుక్తంగా సూక్ష్మ స్థాయి నుండి నిర్వహించాలని కలెక్టర్ ఢల్లీి రావు ఆదేశించారు. ముందుగా కుష్టు వ్యాధిపై గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఢల్లీి రావు ఆదేశించారు. సమావేశంలో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, అడిషనల్ డిఎంహెచ్వో డా.ఉషారాణి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం.ఉమాదేవి, గ్రామ వార్డు సచివాలయ జిల్లా అధికారి కె.అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!