నవంబర్ 18 (ఆంధ్రపత్రిక): డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే ఆ క్రేజ్ వేరు. భారతీయుడు, రోబో, ఐ లాంటి సినిమాలతో హిట్ కొట్టి, డిఫరెంట్ స్టైల్‌ని పరిచయం చేశాడు. శంకర్ తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఆయన సినిమాల్లో డైరెక్ట్ చేసిన పాటలు మరో ఎత్తు. ప్రపంచంలో ఉండే అద్భుతమైన ప్రాతాల్ని ఆయన పాటల్లో కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. ఒక్క పాటకోసం ఎన్ని రోజులైనా వేచి చూస్తాడు. ఎంత దూరం అయినా వెళ్తాడు. అయితే, రామ్ చరణ్ హీరో, కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ’ఆర్ సి15’లో ఒక పాటను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌పై తీస్తున్న ఈ చిత్రంలోని పాటను రూపాయలు 15 కోట్లు పెట్టి తీస్తున్నారు. 12 రోజుల పాటు న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుగుతుంది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఒక్క పాటను 15 కోట్ల బడ్జెత్ తీస్తున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ సినిమాలో ఎస్.జే. సూర్య, అంజలీ, జయరామ్, సునిల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాసర్, రఘుబాబు, సముద్రకని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!