పంజాబీ లస్సీ
పెరుగు – ఒకటిన్నర కప్పు, పంచదార – నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ – కొన్ని, చల్లటి నీళ్లు – రెండు గ్లాసులు.
ఇంట్లో సులభంగా తయారుచేసుకునే సమ్మర్ డ్రింక్ ఇది. శరీరానికి చలువ చేసే ఈ పానీయం తయారీ చూద్దాం…
కావలసినవి: పెరుగు – ఒకటిన్నర కప్పు, పంచదార – నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ – కొన్ని, చల్లటి నీళ్లు – రెండు గ్లాసులు.
తయారీ విధానం: పెరుగును మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత పంచదార, కుంకుమపువ్వు రేకులు, యాలకుల పొడి వేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. చల్లటి నీళ్లు కలపాలి. మరొక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేయాలి