కె.కోటపాడు, నవంబర్ 01 (ఆంధ్రపత్రిక) : పల్లెల్లో ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన 108 అబులెన్స్ ల సేవలు మరింత మెరుగయిన వైద్యసౌకర్యాలతో అందు బాటులోకి వచ్చాయి. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వడ్డాది త్రినాథ్ చెప్పిన వివరాలు ప్రకారం. నిన్నటి దాకా 90వేలమంది జనా భాకు ఒకటి చొప్పున 108 అంబులెన్స్ లు సేవలంది స్తున్నాయి. ఇప్పుడు 50వేల మంది జనాభాకొకటి వంతున 108 అబులెన్స్ లు సేవలను విస్తరించాయి. రోగులను ఇళ్ళ నుంచి ఆసుపత్రులకు చేరవేసే కీలక సమయంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన 108 అంబులెన్స్‌ను డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఈ నెల29న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అంబులెన్స్ మునుపటి 108 అంబు లెన్స్ కంటే మొబైల్ క్లినిక్‌లా ఉంది. పేషంట్స్ ను హాస్పిటల్స్ చేరవేసేంతవరకు బీపీ, పల్స్, ఈసీజీ, రెస్పిరేషన్, టెంపరేచర్ లను ఎమర్జెన్సీ ల్యాబ్ టెక్నీషియన్ (ఇఎంటి)లు నిరంతరం మానిటరింగ్ చేసే సౌకర్యం 108లో అందుబాటులోకి వచ్చింది. పురుగుల మందులు తాగిన వారిని విషమపరిస్థితుల్లో హాస్పిటల్ కు తరలించే క్రమంలో విషాన్ని బయటకు తీసేసే లేటెస్ట్ ‘‘సెక్షన్ ఆపరేటర్’’ 108 లో అందుబాటు లోకి వచ్చింది. అవసరం మేరకు వినియోగించుకోవ డానికి ఏసి సౌకర్యం కూడా ఉంది. ఇంజక్షన్ చేసే ‘‘సిరంజి ఇన్ఫ్యూషన్ పంప్’’ సెలైన్ బాటిల్స్ ఎక్కించే ‘‘వాల్యూమ్ ఇన్ఫ్యూషన్ పంప్’’లు కూడా లేటెస్ట్ 180 అంబులన్స్ ల్లో ఉన్నాయి. కాగా ‘‘డి’’ టైప్, ‘‘బి’’టైప్ ఆక్సిజన్ సిలిండర్ కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సమయంలో 108 అంబులెన్సు సేవలను వినియోగించు కోవాలని అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ స్టాఫ్ తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!