కె.కోటపాడు,ఏప్రిల్ 01(ఆంధ్రపత్రిక):విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో పురుడు పోశారు108 వాహనం ఆరోగ్య సిబ్బంది. ఆరోగ్యం సిబ్బంది జి.రామలక్ష్మి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన గర్భిణి జె.దివ్య(19) పురిటి నొప్పులతో స్థానిక 50 పడకల ప్రభు ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం చేరారు. గర్భంలోనే శిశువు గుండె వేగం పెరగడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు విశాఖపట్నంలోని కె.జి.హెచ్.కు రిఫర్ చేశారు. శుక్రవారంరాత్రి 108 వాహనంలో గర్భిణి దివ్యను తరలిస్తుండగా వేపగుంటవద్దకు వెళ్లేసరికి పురిటి నొప్పులు అధికమయ్యాయి. అప్పటికే 108 వాహనంలో పర్యవేక్షిస్తున్న మెడికల్ టెక్నీషియన్ రామలక్ష్మి దివ్యకు సుమారు 8.30గంటలకు పురుడుపోసింది.దివ్య పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్యం కోసం కె.జి.హెచ్.లో చేర్పించామని టెక్నీషియన్ రామలక్ష్మి తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!