కె.కోటపాడు,మార్చి10(ఆంధ్రపత్రిక):సి.పి.ఎస్.ను రద్దుచేసి ఒ.పి.ఎస్.ను అమలు చేయాలని సిపిఎం జిల్లానాయకులు గండి నాయనబాబు డిమాండ్ చేశారు.వామపక్షాలు పిలుపు మేరకు సిపిఎం,సిపిఐ నాయకులు శుక్రవారం స్థానిక “సిటు’ కార్యాలయం నుండి మూడు రోడ్లకూడలి మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులపై నిర్బంధాన్ని విడనాడి, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.సిపిఐ జిల్లా సమితి సభ్యులు వేచలపు వెంకటరమణ(కాసుబాబు) మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల డి.ఎ.బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం మండల నాయకులు యర్రా దేముడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినహామీలు నిలబెట్టుకొని అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడు, రైతు సంఘం మండల నాయకులు వనుము సూర్యనారాయణ, కె.వి.పి.ఎస్.(కుల వివక్ష పోరాట సమితి) జిల్లా అధ్యక్షులు గాడి ప్రసాద్, నాయకులు రొంగలి తాతబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!