సీఎం జగన్ ఆదేశాల మేరకు స్మృతివనం పనులు పరిశీలన
పరిశీలనలో పాల్గొన్న మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మీ గారు.
విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ తలపెట్టిన అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు విజయవాడ స్వరాజ్య మైదానంలో వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి గారు అక్కడ జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు.అంబేద్కర్ స్మృతివనం పనులు గురించి విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ వారి క్యాంపు ఆఫీసులో రివ్యూ మీటింగ్ నిర్వహించినారు. మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మీ గారు తో విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారు క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఏపీ.ఐ.ఐ.సీ. అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు.ఈ సందర్భం గా స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి గారు మీడియాతో మాట్లాడారు.125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణ పనులు వేగవంతం అయ్యేందుకు,అంబేద్కర్ స్మృతివనం పనులు నాణ్యత పై సీఎం జగన్ ఆదేశాల మేరకు మంగళవారం పనులు పరిశీలన చేసినట్లు ఆమె తెలిపారు. నాణ్యతా, ప్రమాణాలపై కాంట్రాక్టర్ల కు సూచనలు చేయటం జరిగింది అని ఆమె అన్నారు.జూలై నాటికి విగ్రహం పూర్తవుతుంది అని 72 రోజుల్లో మొత్తం పని పూర్తి చేస్తాం అని మొత్తం విగ్రహం విడిభాగాలు రావడానికి కొంత సమయం పడుతుంది అని ఒక ప్రొఫెసర్ పర్యవేక్షణలో ప్రతీ చిన్న పని జాగ్రత్తగా క్వాలిటీ తో చేస్తున్నాం అని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సమయం పడుతుంది అని ఒక రెస్టారెంట్, ఒక ఫాస్టుఫుడ్ సంస్థ సెంటర్, ఒక థియేటర్, ఎగ్జిబిషన్ సెంటర్ కొత్తగా వస్తాయి అని మ్యూజికల్ ఫౌంటెయిన్ కూడా వస్తుంది అని ప్రత్యేక ఎస్టేట్ ఆఫీసర్ ఉండి ఒక ప్రత్యేక పరిపాలనా ఆఫీసు వస్తుంది అని బందర్ రోడ్ ఫుట్ పాత్ 4 కిలోమీటర్లు రెండు వైపులా అభివృద్ధి చేస్తున్నాం అని ఇండియా గేట్ లాంటి నిర్మాణం బందర్ రోడ్డులో చేయాలని ప్లానింగ్ చేస్తున్నమని పేర్కొన్నారు.