కె.కోటపాడు,మార్చి15(ఆంధ్రపత్రిక):
పాడిరైతుల సంక్షేమానికి సత్యనారాయణ అందించిన సేవలు మరువలేమని చౌడువాడ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వైఎస్సాఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల శివాజీరాజు అన్నారు. మండలంలోని చౌడువాడ గ్రామంలో మంగళవారం విశాఖ డెయిరీ డైరెక్టరు సుందరపు గంగాధర్ స్వగృహంవద్ద తండ్రి స్వర్గీయ సత్యనారాయణ 11వ వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న పలువురు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ డెయిరీ డైరెక్టరుగా సత్యనారాయణ పాడిరైతుల అభివృద్ధికి కృషి చేశారన్నారు.రైతుల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలకల్పించి వారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు. డెయిరీకి, రైతులకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సత్యనారాయణ సంస్మరణార్ధం ఏటా టెన్త్ పరీక్షల విద్యార్థులకు సామాగ్రిని తనయులు అందచేయడం ఆచరణీయమన్నారు.ఈ సందర్బంగా స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు 120 మందికి పరీక్షా సామాగ్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఏటుకూరి రాజేష్. పాలసొసైటి అధ్యక్షులు కొమార వెంకటరమణ, మాజీ అధ్యక్షులు కొమార ఎర్రినాయుడు, షుగరు ఫ్యాక్టరీ మాజీ డైరెక్టరు రాజి శ్రీనివాసరావు, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు రాజి మోది నాయుడు, వార్డు మెంబరు తనకల పట్టాలు, రాజి అప్పలనాయుడు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ సూపర్వైజర్లు, పాల సొసైటీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!