Andhrapatrika : శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం ఉంటుంది.కొలిచిన వారికి కొంగు బంగారంగా భావించే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి శ్రీశైలం (Srisailam) మహా పుణ్యక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల (Ugadi Brahmostavalu)కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మొదలుపెట్టారు. ఉగాది సందర్భంగా కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. గత శివరాత్రి మహోత్సవాల సందర్భంగా శివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేక ఆలయ అధికారులు తీవ్ర విమర్శల పాలయ్యారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు.శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం ఉంటుంది. గురువారం నుంచి 18వ తేదీవరకు నిర్దిష్ట వేళలలో నాలుగు విడతలుగా భక్తులకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తారు.ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు 5 ఐదు లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ స్పర్శదర్శనం టికెట్ రుసుము రూ.500.లుగా ఉంటుంది. ఒక్కొక్క విడతలో 1500 టికెట్లు మాత్రమే ఇస్తారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!