మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళి అర్పించారు.
అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై దీక్షకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన షర్మిల.. కేసీఆర్కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో లిక్కర్స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు. మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ భద్రత లేదన్నారు. విచ్చలవిడి మద్యం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.