విశాఖపట్నం,మార్చి, (ఆంధ్రపత్రిక):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన కంటి అద్దాల సరఫరాకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ కొరకు జిల్లా అందత్వ నివారణ సంస్థ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ విశ్వమిత్ర సోమవారం తెలిపారు . సుమారు 6 వేల మందికి సంబంధించి అద్దాలు ఫ్రేమ్ కలిపి ఒక్కొక్కటి రూ.280 ధర మించకుండా సీల్డ్ కవర్ ద్వారా ఈ నెల 27 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు స్వయంగా గాని, పోస్టల్ లో గాని పాలన్నారు. 5 వేల రూపాయలు ధరావత్తుతో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య శాల, విశాఖపట్నం వారికి టెండర్ దాఖలు చేయవలసినదిగా కోరారు.