Pragya Thakur , Andhrapatrika : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గరంగరం అవుతోంది. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ.. భారత దేశంలో ప్రజాస్వామ్యంపై, మీడియాపై అణిచివేత కొనసాగుతోందని, మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు దాడులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. లండన్ లో మాట్లాడుతూ.. పార్లమెంట్ విపక్షాలు మాట్లాడే సమయంలో మైకులు కట్ చేస్తున్నాంటూ వ్యాఖ్యానించారు. తాజాగా బీజేపీ నేత, ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. చాణక్యుడు చెప్పినట్లు విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని, దీన్ని రాహుల్ గాంధీ మరోసారి నిరూపించడాని ఆమె అన్నారు. మీ తల్లి ఇటలీ నుంచి వచ్చినవారు కావడంతో మీరు భారతదేశానికి చెందిన వారు కాదని మేము భావిస్తున్నామని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ మైక్ నిలిపేస్తున్నారనే వ్యాఖ్యలపై స్పందించిన ప్రజ్ఞా ఠాకూర్.. కాంగ్రెస్ పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించడం లేదని, పార్లమెంట్ సరిగ్గా జరిగితే ఎక్కువ పనులు జరుగుతాయని, అయితే అలా జరిగితే కాంగ్రెస్ మనుగడ సాధించలేదనే భయం వారిలో ఉందని, వారి ఉనికే ఉండదని అన్నారు.రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలతో ఎన్నుకోబడ్డారు.. ఇప్పుడు ఇక్కడి ప్రజలను అవమానిస్తున్నారని, విదేశాల్లో కూర్చోని పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారని, ఇంతకన్నా అవమానం మరోటి ఉండదని, రాహుల్ గాంధీకి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదని, దేశం నుంచి తరిమేయాలని ప్రజ్ఞా ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోఫాల్ ఎంపీగా ఉన్న ప్రజ్ఞా ఠాకూర్.. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆమె ఎదురుదాడికి దిగారు. సెప్టెంబరు 29, 2008న ఉత్తర మహారాష్ట్రలోని మతపరమైన సున్నితమైన పట్టణమైన మాలేగావ్‌లోని ఒక మసీదు సమీపంలో మోటార్‌సైకిల్‌కు పేలుడు పదార్ధం పేల్చడంతో ఆరుగురు మరణించారు మరియు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ఠాకూర్ 2017 నుండి బెయిల్‌పై బయట ఉన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!