సైనికులు…రెట్టించిన ఉత్సాహంతో స్వచ్ఛందంగా విచ్చేసిన వీర మహిళలు..మీడియా కి పాస్ లు ఇవ్వడంలో అపరిపక్వత… . పాస్ లు ఉన్నవారికి కూడా నో ఎంట్రీ.. లోపించిన పోలీసు పర్యవేక్షణ… మచిలీపట్నం, ఆంధ్ర పత్రిక , మార్చి 14. జన సేన 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక సుమా కన్వెన్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ సభకు ఊహించిన దానికన్నా లెక్కకు మిక్కిలిగా రెట్టించిన ఉత్సాహంతో జన సైనికులు, వీర మహిళలు సాయంత్రం 2 గంటలకే సభా స్థలి వద్దకు తండోప తండాలుగా తరలి రావడం తో నగరం జన సంద్రం అయ్యింది. జన సైనికులు, వీర మహిళలు వివిధ జిల్లాల నుండి మాత్రమే గాక తెలంగాణా జిల్లాల నుండి కూడా రావడం జరిగింది. జన సైనికులను అదుపు చేయడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యిందనే చెప్పొచ్చు. సభా ప్రాంగణము బయటే అంచనాలకు మించి జన ప్రవాహంతో , సమూహం గా ఉండడం వల్ల మీడియా వారు కూడా లోపలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి కొంతమంది మీడియా ప్రతినిధులు వెనుతిరిగడం కనిపించింది.తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీనికి తోడు పోలీసు యంత్రాంగం పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడం జరిగింది. మీడియా వారి ఎంట్రీ , వి. ఐ.పి. గేట్ ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యమైన గేట్ల వద్ద మాత్రమే కాదు ప్రతి ఎంట్రన్స్ గేట్ వద్ద పోలీసు భద్రత లోపించడం వల్ల పాస్ లు ఉన్న వాళ్ళు కూడా నానా ఇక్కట్లు పడ్డారు. దీనికి తోడు, దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించడం వల్ల మీడియా మిత్రులతో బాటు సభకు హాజరైన జన సమూహం లో కొంత మంది పర్సు లు, సెల్ ఫోన్లు కోల్పోయి లబోదిబోమంటూ గగ్గోలు పెట్టారు. సుమా కన్వెన్షన్ హాల్ వద్ద , మెయిన్ రోడ్స్ వద్ద అక్కడక్కడ పోలీసులు ఉన్నారే తప్ప పవన్ కళ్యాణ్ సభా వేదిక ముఖ్యమైన గేట్లు వద్ద పోలీస్ బందోబస్తు లేక పోవడం వల్ల దొంగలు చెలరేగిపోయారు. ఇది ఇలా ఉండగా సాయంత్రం సభ 5 గంటలకు ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. దారి పొడవునా ట్రాఫిక్ అంతరాయం వల్ల సభా వేదిక వద్దకు జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వారాహి తో చేరుకునే సరికి రాత్రి 8.గంటలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయినా సభకు విచ్చేసిన జన సైనికుల ఉత్సాహం నీరు కారలేదు. జన సేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం ఎదురు చూడడం కనిపించింది. ముఖ్యంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఉబయ గోదావరి జిల్లాల నుండి ద్విచక్ర వాహనాలపై సభకు చేరుకోవడం గమనార్హం. మీడియా ప్రతినిధి ఈ వార్త పంపే సరికి జన సేనాని పవన్ కళ్యాణ్ ఉయ్యూరు దాటినట్టు సమాచారం. వివిధ జిల్లాల నుండి లెక్కకు మిక్కిలిగా విచ్చేసిన జన సైనికులతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉండగా బందరు నగరం లో ఎక్కువ మంది జన సైనికులు పవన్ సభకు తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా బోసి పోయి కనిపించాయి. జన సైనికుల వాహనాలు కిలోమీటర్ దూరం లో ఉంచినా నిర్వాహకులు వారికి కావలసిన బోజన ఏర్పాట్లు, మజ్జిగ పంపిణీ చేసి ,వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వారి అభిమానం చూరగొన్నారు.దారి పొడవునా అశేష సంఖ్యలో పవన్ కళ్యాణ్ కి జన సైన్యం స్వాగతం పలికారు. సభ విజయవంతం అవుతుందని జన సైనికులు సంబర పడుతున్నారు. బందరు నియోజక వర్గ ఇంఛార్జి బండి రామ కృష్ణ, జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ కృష్ణ, జన సేన కార్పొరేటర్ పినిశెట్టి చాయా దేవి, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ , వంపుగడపల చౌదరి , గడ్డం రాజు, తదితరులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన జన సైనికులకు, ఆహార ఏర్పాట్లు, మజ్జిగ పంపిణీ , ప్రాంగణం లోపల పర్యవేక్షణా ఏర్పాట్లు చేశారు. వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తానికి జన సేనాని సభ అంబరాన్ని అంటుతుందని జన సైనికులు ఆనందం గా కేరింతలు కొట్టడం కనిపించింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!