-డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు
కె.కోటపాడు,ఏప్రిల్01(ఆంధ్రపత్రిక):
చారిటబుల్ ట్రస్ట్ లు, రోటరీ క్లబ్ లు స్వచ్ఛందంగా సేవలు చేయడం ఆదర్శనీయమని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ సమాకూర్చిన వీల్ చైర్స్ ను శనివారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిప్యూటీ సిఎం బూడి ముఖ్యఅతిధిగా పాల్గొని అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ లు పంపిణీ చేసిన రోటరీ క్లబ్, కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్ జి.కె.మూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తరిస్తామన్నారు. కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టరు పి.కె.జోసె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సమాజానికి సేవ చేయడం బాధ్యతగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 23 మంది వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, జడ్పిటిసి సభ్యురాలు ఈర్లె అనురాధ, రోటరీ క్లబ్ ప్రతినిధులు గుమ్మడి వంశీధర్, నాగరాజు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.