మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యకరమం విజయవంతం
కొత్తవలస పబ్రవరి 12ఆంధ్ర పత్రిక, మండలములో వియ్యంపేట పరిధిలో గల 8 సచివాలయాలలో ఈ నెల 11, 12,13తేదీలలో 24 గ్రామాలలో 18267 జనాభా కి గాను 17,485 మంది జనాభా కి డి ఈ సి ఆల్బండాజోలు మాత్రలు మింగించినట్లు వైద్యాధికారి తెలిపారు, ఏ. ఎన్. ఎమ్ లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు కలిపి బోధ వ్యాధి నివారణకు డి. ఇ. సి. మాత్రలు, కడుపులో నివారణకు ఆల్బండాజోలు మాత్రలు ఇంటింటికి పంచి మింగించినట్లు తెలిపారు. ఈ మాత్రలు గర్భిణీలు, రెండు సం “లు లోపు పిల్లలు, దీర్గ కాలిక వ్యాధి గ్రస్తులు వేసుకోరాదని, ఖాళీ కడుపు తో వేసుకోరాదని, భోజనం తర్వాత వేసుకోవాలని తెలిపారు.95% బోధ వ్యాధి నివారణ కార్యక్రమం విజయవంతం అయినట్లు మిగతా 5% జనాభా కవర్ చేస్తామని తెలిపారు. వియ్యంపేట బి. ఆర్. అంబేద్కర్ గురుకులం విద్యార్థినిలకు, ప్రిన్సిపాల్ టి. జయశ్రీ ఆధ్వర్యంలోను,బి. సి. బాయ్స్ హాస్టల్ లోవార్డెన్ సమక్షంలో వైద్యధికారులు మాత్రలు మింగించారు. రామలింగాపురం, నిమ్మలపాలెం లో ఏ. ఎన్.ఎ యమ్ లు అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమం లో ఎంపీ. హెచ్. ఈ. ఓ లు గోవిందరాజులు, తిరుపతి రావు, పి. హెచ్. ఎన్. జగదాంబ, హెచ్. వి. పద్మావతి, హెచ్. ఎస్. రాము, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఏ. ఎన్.ఎమ్. భవాని లు పాల్గొన్నారు.