నలుగురు అక్కడిక్కడే మృతి
కూకట్పల్లిలో డివైడర్ను ఢీకొన్న కారు
రంగారెడ్డి,ఫిబ్రవరి10(ఆంధ్రపత్రిక): నిర్లక్ష్యం నిండుప్రాణాల్ని బలతీసుకుంటోంది. అతివేగం కొంప ముంచుతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అతివేగంతో ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. కన్నవారికి, కుటుంబ సభ్యులకు గుండెకోతను మిగిల్చి వెళ్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా చాలామంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సవిూపం లోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సవిూపంలోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇకపోతే కూకట్పల్లి లోధా రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారు టైరు పేలడంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయాలపాలైన డ్రైవర్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!