andhrapatrika ; మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాల పరిరక్షణకై ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. గంగా భవాని పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు పాయకాపురం లోని సుందరయ్య నగర్ లో మహిళలతో ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా గంగా భవాని మాట్లాడుతూ- సమాజంలో మహిళలు తీవ్రమైన వివక్షతకు, అత్యాచార దాడులకు, హత్యలకు గురవుతున్నారన్నారు.8 గంటల పని దినాల కోసం 115 సంవత్సరాల క్రితమే మహిళలు పోరాట బాట పట్టారని,ఆ పోరాటం నేటి మహిళలకు స్ఫూర్తి అని అన్నారు. బానిస సమాజంలో మహిళలు కుటుంబాన్ని నడపడం,ఆహారం సేకరించడం,పిల్లల్ని పెంచడం చైతన్యవంతంగా మహిళలు పని చేశారన్నారు . పితృస్వామ్య సమాజంలో మహిళలను ఇంటికే పరిమితం చేసి కట్టుబాట్లు నిర్దేశించారన్నారు. పెట్టుబడిదారీ సమాజంలో మహిళలను ఆట వస్తువులుగా,మార్కెట్ వస్తువుగా చిత్రీకరించారని తెలిపారు.వ్యాపార,వాణిజ్య సరుకుగా నేడు పెట్టుబడిదారులు చిత్రీకరిస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ,షా ప్రభుత్వం శ్రామిక మహిళలపై పని భారాన్ని మోపుతూ 8 గంటల పది దినాలను 12 గంటలు పెంచడానికి,48 కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు కోడ్లను తీసుకువస్తున్నారన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం,మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు,హత్యలు అరికట్టాలని డిమాండ్ చేశారు.వీటికి వ్యతిరేకంగా మహిళా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ ప్రదర్శనలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.పద్మ,నగర అధ్యక్షురాలు కె. దుర్గ,నాయకురాలు వై. సుజాత,పి.దుర్గ,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు ..
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!