న్యూఢల్లీి,ఫిబ్రవరి 10 : గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై కొంతకాలంగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బీబీసీ కార్యకలాపాలను భారత్‌లో పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ‘ఓ లఘుచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదు’ అని సుప్రీం కోర్టు పిటిషనర్లు హిందూసేన చీఫ్ విష్ణు గుప్తాతోపాటు బీరేంద్ర కుమార్ సింగ్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను విచారణకు తిరస్కరించింది.ఈ విషయంపై పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్.. భారత్‌కు, భారత ప్రభుత్వానికి బీబీసీ వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ‘భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా’ తాజా లఘుచిత్రాన్ని రూపొందించిందని అన్నారు. దీని వెనక ఉన్న కుట్రను బహిర్గతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషనర్ అభ్యర్థనను విన్న జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం.. దీనిని తప్పుగా భావించారని, ఇది విచారణకు అనర్హమని పేర్కొంది. నిషేధంపై ఆదేశాలు న్యాయస్థానం ఎలా జారీ చేస్తుందని పిటిషనర్‌ను ప్రశ్నించింది.మరోవైపు ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందిన డాక్యుమెంటరీపై ఆంక్షలను సవాల్ చేస్తూ సీనియర్ పాత్రి కేయుడు ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కలిసి వేసిన పిటిషన్‌తో పాటు.. మరో న్యాయవాది ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డాక్యుమెంటరీని అడ్డుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలంటూ ఫిబ్రవరి 3న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!