– నగర ప్రజలకు అందుబాటులో అత్యాధునిక సంతాన సాఫల్య చికిత్సలు
– ఫెర్టి కేర్ తో సంతాన భాగ్యం
– రెండేళ్ల క్రితం ఒంగోలులో ప్రారంభం
– అత్యధిక సక్సెస్ రేటుతో 500కి పైగా ఐవీఎఫ్ సైకిల్స్ పూర్తి
– సంతాన లేమికి సరైన చికిత్సలతో కచ్చితమైన పరిష్కారం
– విజయవాడ సెంటర్ ప్రారంభోత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మంజుల అనగాని
విజయవాడ, andhrapatrika : సంతాన సాఫల్య చికిత్సలతో ప్రఖ్యాతిగాంచిన ఫెర్టి కేర్ ఐవీఎఫ్ సెంటర్ సేవలను విజయవాడకు విస్తరించారు. నగరంలోని మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటరులో ఫెర్టి కేర్ ఐవీఎఫ్ సెంటర్ ను గురువారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మంజుల అనగాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మంజుల మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలతో సంతాన లేమి సమస్యను చక్కగా పరిష్కరించవచ్చని తెలిపారు. సంతానం భాగ్యం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఫెర్టి కేర్ అద్భుత అవకాశమని అన్నారు. ఒంగోలులోని సెంటర్ ద్వారా అనేక మందికి సంతాన సాఫల్య చికిత్సలందించిన ఫెర్టి కేర్ వైద్య బృందానికి డాక్టర్ మంజుల అనగాని అభినందనలు తెలియజేశారు. అనంతరం ఫెర్టి కేర్ మెడికల్ డైరెక్టర్లు డాక్టర్ ఉజ్వల్ జాస్తి, డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ, ఒంగోలులో 2021లో ఫెర్టి కేర్ ఐవీఎఫ్ సెంటరును ప్రారంభించామని, తమ రెండేళ్ల విజయ ప్రస్థానంలో 70 శాతం సక్సెస్ రేటుతో 500కి పైగా ఐవీఎఫ్ సైకిల్స్ ను పూర్తిచేశామని వివరించారు. నగరంలో నూతనంగా ప్రారంభించిన ఫెర్టి కేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సంతాన సాఫల్య చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఫెర్టి కేర్ లోని అత్యంత అనుభజ్ఞులైన నిపుణుల నేతృత్వంలో, ఇన్ఫెర్టిలిటీ ఎవల్యూషన్, ఫెర్టిలిటీ కౌన్సిలింగ్, ఒవులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, డోనర్ ట్రీట్మెంట్స్, సరోగసీ, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, లేజర్ అసిస్టెడ్ హ్యచింగ్, బ్లాస్టోసిస్ కల్చర్, ఈఆర్ఎ, పీజీఎస్-పీజీడీ, ఎండోస్కోపీ, హిస్టెరోస్కోపీ, లాపరోస్కోపీ, సెమెన్ ఎనాలిసిస్, డీఎన్ఎ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, టీఈఎస్ఎ/టీఈఎస్ఈ, డాప్లర్ ఫేర్ వెరికోసిల్, ఎండోక్రైన్ టెస్టులు తదితర అత్యాధునిక లభిస్తాయని డాక్టర్ ఉజ్వల్, డాక్టర్ శ్రావణి అన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ప్రయివేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గన్ని భాస్కరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని, విజయవాడ అబ్స్టెట్రివ్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సుశీల పిన్నమనేని, ఐఎంఎ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.ఎ. రెహ్మాన్, ఫెర్టి కేర్ విజయవాడ సెంటర్ క్లినికల్ హెడ్ డాక్టర్ జె. ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.