అమరావతి,మార్చి 15 (ఆంధ్రపత్రిక): ఉద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీనిపై ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం తమను ఆహ్వానించడం లేదని, పిలిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సూర్యనారాయణ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ను కలిసినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై రాష్ట్రప్రభుత్వం గుర్రుగా ఉంది. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే, దీనిపై సూర్యనారాయణ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!