*ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ గారు పనిచేస్తున్నారు:శాసనసభ్యులు సింహాద్రి..*
మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి గ్రామ సచివాలయం -2 పరిధి మేళ్లమర్రు, అయోధ్య, అర్జపాలెం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికై వెళ్తున్నామని,అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అన్నది సీఎం జగన్ గారి సిద్ధాంతం. న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే జగన్ గారి ప్రభుత్వ సంకల్పం. ఆ సంకల్పమే ధ్యేయంగా మేము గడపగడపకి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకొని, వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకొని తక్షణమే పరిష్కరించే మార్గంగా ముందుకు వెళ్తున్నమని శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు తెలిపారు.*ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ వెంకటేశ్వర రావు గారు ,ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్స్, నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..*