అక్రమాలు జరిగాయన్న పిటిషన్పై విచారణ
పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఆగ్రహం
విచారణను రెండు వారాలకు వాయిదా
అమరావతి,మార్చి 6 (ఆంధ్రపత్రిక): పోలవరం కాలువ తవ్వకాలపై ఏపీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. పోలవరం కాలువలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పిల్లి సురేంద్ర బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. పోలవరం కాలువ తవ్వకాలతో సుమారు రూ. 850 కోట్ల విలువ చేసే గ్రావెల్ అక్రమంగా తరలించినట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు.. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఆంధప్రదేశ్ హైకోర్టు పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం కాలువ తవ్వకాలపై స్టే విధించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఆంధప్రదేశ్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.