నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): ’పుష్ప’ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా సక్సెస్‌తో దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ’పుష్ప’పై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ బెటర్ అవుట్‌పుట్ కోసం దర్శకుడు సుకుమార్ మరింత దృష్టి సారించారు. చిత్రీకరణ దశ నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకంటున్నారని, షూటింగ్తోపాటే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో ’పుష్ప 2’కుసంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసున్నారట. దీనికి సంబంధించిన వర్క్ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో బన్నీ లేని సన్నివేశాలను ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో చిత్రీకరిసున్నారు. సినిమా క్రేజ్‌ను మరింత పెంచేందుకు డిసెంబరు 16న విడుదల కానున్న ’అవతార్ 2’ సినిమాతో పాటు ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీనితోనే విడుదల తేదీ గురించి కూడా క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ విడుదలైతే అభిమానులకు పండగే! అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!