Delhi, Andhrapatrika:-పాత రూ.500 నోట్లు, రూ. 1000 కరెన్సీ నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా? ఇంకా ఈ ఆప్షన్ అందుబాటులో ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI – ఆర్బీఐ) లెటర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆర్బీఐ పాత కరెన్సీ నోట్లకు సంబంధించి మార్చుకోవడానికి గడువును పొడిగించిందని ఇందులో ఉంది. అయితే ఈ ఫెసిలిటీ విదేశీయులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ లేటర్లో వెల్లడి అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రకటించింది. రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు చెల్లుబాటు కావని వెల్లడించింది. దేశంలో వీటిని రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే డీమానిటైజేషన్ తర్వాత కరెన్సీ నోట్ల మార్పిడికి కేంద్రం అనుమతి ఇచ్చింది.రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను బ్యాంక్‌కు వెళ్లి మార్చుకోవచ్చని తెలిపింది. చాలా మంది డీమానిటైజేషన్ నిర్ణయం తర్వాత పాత నోట్లను బ్యాంక్‌కు తీసుకువెళ్లి కొత్త నోట్లతో మార్చుకున్నారు.అయితే ఇప్పుడు ఆర్బీఐ విదేశీయులకు పాత రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చిందని ఒక లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆర్బీఐ లెటర్ ఫేక్ అని తేల్చేసింది. పాత రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి అవకాశం లేదని వెల్లడించింది. ఆర్బీఐ లెటర్ పూర్తి ఫేక్ అని తెల్చేసింది. విదేశీయులు వారి వద్ద ఉన్న పాత రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను మార్చుకోవడానికి గడువు 2017లోనే అయిపోయిందని స్ఫష్టం చేసింది. మళ్లీ ఇప్పుడు పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి గడువు ఇవ్వలేదని తెలిపింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్బీఐ లెటర్‌ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయలేదని పేర్కొంది. అది ఫేక్ అని పేర్కొంది. అందువల్ల మీరు కూడా ఇలాంటి మెసేజ్‌ను చూసి ఉంటే.. జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఇలాంటి మెసేజ్‌లతో పాటుగా మోసపూరిత లింక్స్ కూడా ఉంటాయి. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోవచ్చు. అందుకే ఇలాంటి మోసపూర్తిత అంశాల పట్ట జాగ్రత్తగా ఉండాలి.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!