Amit Shah tour, Andhrapatrika : సంవత్సర కాలం నుంచి తెలంగాణపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇవాళ ఆయన తెలంగాణ రాక.. రాజకీయంగా కాక రేపుతోంది.ఎలాగైనా సరే.. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రావాలి అని టార్గెట్ ఫిక్స్ చేసిన బీజేపీ అగ్రనాయకత్వం.. తరచూ తెలంగాణ టూర్లు వేస్తోంది. అదే విధంగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ వస్తున్నారు. ఇది రాజకీయ పర్యటన కాకపోయినా… దీనికి తెరవెనక రాజకీయ మంత్రాంగం ఉందంటున్నారు విశ్లేషకులు. తన టూర్ షెడ్యూల్లో భాగంగా ఇవాళ అమిత్ షా… రాత్రి 8:25కి హకీంపేట ఎయిర్పోర్టుకి వస్తారు. ఆదివారం ఉదయం అధికారిక కార్యక్రమమైన CISF రైజింగ్ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి కేరళలోని కొచ్చికి వెళ్తారు. ఐతే.. ఈ టూర్లో పొలిటికల్ అజెండా కూడా ఉంది.
ఇవాళే మీటింగ్:
ఇవాళ రాత్రి బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆ తర్వాత దర్యాప్తులు, వరుస అరెస్టులతో.. తెలంగాణలో రాజకీయ వేడి బాగా పెరిగింది. దానికి తోడు ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టివేస్తూ… BRS అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ … డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని తమ పార్టీ నేతలకు చెప్పడంతో.. బీజేపీ కూడా ఈ ఎన్నికలకు రెడీ అవుతోంది. తాజా పరిణామాలు, ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇవాళ అమిత్ షా.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సంగ్రామ పాదయాత్రను విడతల వారీగా జరుపుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్పై ఫైర్ అవుతూనే ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీలో ఇతర నేతలు కూడా యాక్టి్వ్ అవుతున్నారు. ఇలా కమలదళంలో ఎన్నికల ఉత్సాహం కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గనుక ఈడీ అధికారులు అరెస్టు చేస్తే… తెలంగాణ బీజేపీకి అది రాజకీయంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యమంత్రి కూతురును అరెస్టు చేయడం అనేది బీఆర్ఎస్కి రాజకీయంగా పెను సవాల్ అవుతుంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటూ… బీజేపీ నేతలు.. బీఆర్ఎస్పై బలమైన విమర్శలు చేసే అవకాశాలు ఉంటాయి. సీఎం కేసీఆర్ను డైరెక్టుగా టార్గెట్ చేసేలా పొలిట్రిక్స్ నడిపే పరిస్థితి రాగలదు. అందువల్ల ఇవాళ అమిత్ షా.. తమ శ్రేణులకు ఎలాంటి సూచనలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది