Karnataka, Andhrapatrika : కర్ణాటకలో రోడ్లు బాగానే ఉంటాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేసేస్తుంటారు. అక్కడ బెంగళూరు – మైసూరు మధ్య రాకపోకలు చాలా ఎక్కువ. అందుకే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌వేని కేంద్రం రూ.8,480 కోట్లతో నిర్మించింది. దాన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.ఈ ఫొటోల్లో కనిపిస్తున్నదే బెంగళూరు – మైసూరు ఎక్స్‌ప్రెస్ వే. NH 275 లో… బెంగళూరు – నిడఘట్ట – మైసూరు సెక్షన్లో ఈ ఎక్స్‌ప్రెస్ వేని నిర్మించారు. దీన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.ఈ ప్రాజెక్టులో 6 లేన్ల రహదారిని నిర్మించారు. మొత్తం 118 కిలోమీటర్ల హైవే. దీని నిర్మాణానికి సుమారు రూ.8,480 కోట్లు ఖర్చైంది.ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల బెంగళూరు, మైసూరు మధ్య రాకపోకల సమయం గంటకు పైగా తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు… బెంగళూరు, మైసూరు, మాండ్య వంటి ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రయోజనం కలిగిస్తుందని అంటున్నారు.తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మైసూరు – ఖుషాల్‌నగర్ నాలుగు లేన్ల హైవేకు పునాది రాయి వేస్తారు. ఇది 92 కిలోమీటర్లకు పైగా ఉంది. దీన్ని 4,130 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ హైవే ద్వారా బెంగళూరుతో ఖుషాల్నగర్కి కనెక్టివిటీ పెరుగుతుంది. ట్రావెల్ టైమ్ 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గనుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!