మూడురోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు
విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం
అమరావతి,డిసెంబర్ 7 (ఆంధ్రపత్రిక): ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం తుఫాన్ గా మారే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిరచింది. దీనివల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షా లు పడుతాయని ప్రకటించింది. వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలై తూర్పు ఆగ్నేయంగా 770 కిలో విూట ర్లు, చెన్నైకు 1020 కి.విూ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని తెలిపారు. గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సవిూపంలోని ఉత్తర తమిళనాడు` దక్షిణకోస్తాంధ్ర తీరాలకు తుఫాన్ చేరనుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయ లసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకా శముంది. తీరం వెంబడి గంటకు 50`60 కి.విూ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఆయా ప్రభావిత జిల్లా ల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. కాగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియ జేసింది. ఈ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన అధికారులు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో విస్తా రంగా వర్షాలు కురుస్తాయని వెల్లడిరచారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగం అప్ర మత్తమైంది. ముందు జాగ్రత్తగా చిత్తూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.