సిపిఐ 63వ డివిజన్లో టిడ్కో జగనన్న ఇళ్ల పట్టాలా లబ్దిదారుల సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.వి భాస్కర్ రావు మాట్లాడుతూ పునాదులు కూడా పూర్తికాని జగనన్న ఇళ్లు ఎంత కాలానికి ఇస్తారు, ఇప్పటికే ప్రజల ఓపికను పరీక్షిస్తున్నారు. లబ్ధిదారులను బస్సులలో తీసుకువెళ్లి పునాదులను చూపించి ఇచేస్తున్నాం ఇచ్చేస్తున్నామని నచ్చ చెప్పే ప్రయత్నాలు వద్దు వెంటనే పూర్తి చేసి ఇవ్వండి. అలాగే వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఆ ఇళ్లను వారే కట్టుకుంటారని డిమాండ్ చేస్తూ మార్చి 2న విజయవాడలో జరుగు మహాధర్నాను లబ్ధిదారులు అందరూ వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కె.వెంకచ్చి, సిహెచ్ ప్రసాద్, షేక్ పీరు,రాజేష్ పద్మనాభం పాల్గొన్నారు