Virat Kohli Century India Vs Australia: రికార్డుల రారాజువిరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
తనకిష్టమైన ఫార్మాట్లో.. తనకిష్టమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై శతకంతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టులో ఈ ఫీట్ నమోదు చేశాడు.
ఉద్వేగానికి లోనైన కోహ్లి
అహ్మదాబాద్‌లో నాలుగో రోజు ఆటలో భాగంగా 241 బంతుల్లో 100 పరుగులు స్కోరు చేసి దాదాపు 40 నెలలుగా ఊరిస్తున్న 28వ టెస్టు సెంచరీ సాధించాడు. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి టెస్టుల్లో కింగ్ కోహ్లి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దీంతో స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాట్‌తో అభివాదం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.
వాళ్ల తర్వాత కోహ్లికే సాధ్యమైంది
కాగా ఆస్ట్రేలియాపై కోహ్లికి ఇది ఓవరాల్‌గా 16వ సెంచరీ. టెస్టుల్లో 8వది. ఈ క్రమంలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ , ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు
సచిన్ టెండుల్కర్- ఆస్ట్రేలియా మీద- 20
డాన్ బ్రాడ్‌మన్- ఇంగ్లండ్ మీద- 19
సచిన్ టెండుల్కర్- శ్రీలంక మీద- 17
విరాట్ కోహ్లి- ఆస్ట్రేలియా మీద 16*
విరాట్ కోహ్లి- శ్రీలంక మీద- 16.