అమరావతి,మార్చి 13 (ఆంధ్రపత్రిక): ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన చర్చించారు. పోలింగ్‌లో అక్రమాలు, వైకాపా దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు.నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల నేపథ్యంలో వైఎస్సార్, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో చోటుచేసుకున్న అక్రమాలు, ఉదయం నుంచి జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు.పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైకాపా నేతలు బోగస్ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై రాజకీయపక్షాలు చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!