సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఎనిమిది గంటలసేపు పని చేస్తే మరి కొంతమంది 12 గంటల సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు.అయితే ఇలా కంప్యూటర్ ముందు అలాగే కూర్చొని పనిచేసే వారికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా చాలామంది అలాగే కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పికి గురవుతూ ఉంటారు. అలా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల వెన్ను నొప్పి కలుగుతుంది. అధికంగా మెదడుతో ఆలోచించి పనిచేసే వారికి ఒత్తిడి పెరిగి అది కాస్త శరీరంలో పలు మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది.అయితే గంటల తరబడి కూర్చుని పని చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అయితే సిస్టం ముందు కూర్చుని పని చేసేవారు అలాగే కూర్చుని ఉండకూడదు. ప్రతి అర్ధగంటకు లేచి ఒకసారి ఎలా వాకింగ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు వ్యాయామం యోగా లాంటివి కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ వెన్ను నొప్పి సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అందుకే ఎప్పుడూ నిటారుగా కూర్చుని పనిచేయాలని చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం యోగా చేయాలి. అలాగే రెండు చేతులతో కాలి వేళ్లను పట్టుకుని ఉండాలి. అప్పుడు కాళ్లను నిటారుగా ఉంచాలి.ఇలా తరచూ చేస్తూ ఉంటే వెన్నునొప్పి సమస్యలు రావు. ఒకవేళ తీవ్రమైన వెన్నునొప్పి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆవాల నూనెతో చేసే మసాజ్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేసే టైంలో గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసుకుంటే వెన్నునొప్పి త్వరగా తగ్గుతుంది. సాధారణంగా అధిక బరువు ఉన్నవారిలో నడుము నొప్పి సమస్య తగ్గదు. కంటినిండా నిద్ర లేకపోవడం వలన కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!