New Delhi, Andhrapatrika:-కేంద్ర ప్రభుత్వం తాజాగా తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే హోలీ పండుగ గిఫ్ట్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను తీసుకువచ్చింది.
స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రూ. 10 వేలు పొందొచ్చు. అంటే హోలీ పండుగకు ఉద్యోగులు రూ. 10 వేల ముందుగానే పొందొచ్చు. ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ ఉండదు. మార్చి 31 వరకు దీన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ అడ్వాన్స్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బెనిఫిట్ కల్పిస్తూ వస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్‌పై ఈ డబ్బులు ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉంటాయి. వీటిని తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇలా ముందుగా పొందే అడ్వాన్స్ మొత్తంపై వడ్డీ భారం ఉండదు. తీసుకున్న రూ. 10 వేల మొత్తనాని నెలకు రూ. 1000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.
ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద దాదాపు రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అంతేకాకుండా ఇలా అందించే స్పెషల్ అడ్వాన్స్ స్కీమ్ మొత్తంపై ఉండే బ్యాంక్ చార్జీలను కూడా కేంద్రమే భరించే ఛాన్స్ ఉంది.
అయితే ఉద్యోగులు ఇలా అడ్వాన్స్ మొత్తాన్ని పొందాలని భావిస్తే.. ఒక విషయం గుర్తించుకోవాలి. ఇలా పొందిన రూ. 10 వేల మొత్తాన్ని డిజిటల్ రూపంలోనే వినియోగించాల్సి ఉంటుంది. అంటే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా మోదీ సర్కార్ గతంలో ఉద్యోగుల కోసం ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ట్రావెల్ అలవెన్స్ కోసం దీన్ని పొందొచ్చు.
మరోవైపు కేందర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు రూపంలో తీపికబురు అందించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈసారి డియర్నెస్ అలవెన్స్ మరో 4 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.
కాగా డియర్నెస్ అలవెన్స్ అనేది ఏటా రెండు సార్లు పెరుగుతూ వస్తుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి డీఏ పెంచుతారు. అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి డీఏను సవరిస్తారు. ఇలా ఏడాదిలో రెండు సార్లు డీఏ పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ సవరణ ఉంటుంది. డీఏ పెరుగుదల వల్ల ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్లకు బెనిఫిట్ కలుగుతుంది.