ప్రపంచాన్ని మెప్పించిన తెలుగుపాట
నాటునాటుకు ఒరిజనల్ సాంగ్ కింద ఆస్కార్
అవార్డును అందుకున్న కీరవాణి,చంద్రబోస్
ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఎంపిక
ఉత్తమ దర్శకుడు డానియెల్ క్వాన్, డానియెల్ ఫైరనెర్ట్
ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
ఉత్తమ నటి మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఆస్కార్ పంటపై సర్వత్రా హర్షాతిరేకాలు
లాస్ఎంజిల్స్,మార్చి13: ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రపంచ వేదికపై తెలుగు సినీ కీర్తిపతాక రెపరెపలాడిరది. ఇన్నాళ్లకు వారికి భారతీయ సినిమా ప్రతిభ ఏంటో తెలిసింది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్ గెల్చుకుంది. సగటు భారతీయుడు గర్వడేలా చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ’నాటు నాటు’ పాటను ఆస్కార్ వరించింది. ఈ అవార్డుతో దేశంలోని ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. చిత్రబృందాన్ని అభినందించారు. ఎమ్.ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకు న్నారు. ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), లిప్ట్ విూ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్‌కు పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న నాటు నాటు పాటకు ఇప్పుడు ఆస్కార్ రావడంతో భారతీయ సినీ ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాట గెలుచుకుంది. ఆ అవార్డు గెలుచుకున్న తొలి ఆసియా పాట ఇదే. రిహాన్నా పాడిన లిప్ట్ మి అప్, టేలర్ స్వీప్ట్ పాడిన కరోలినా, లేడీ గాగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోª`డలెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డు క్రిటిక్స్ చాయిస్‌ను కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్ సాంగ్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకున్నది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా హెచ్‌సీఏ అవార్డులు దక్కించుకున్నది. బెస్ట్ సాంగ్ విభాగంలో హ్యూస్టన్ ఫిల్మ్ క్రికెట్ సొసైటీ అవార్డును కూడా నాటు నాటు కైవసం చేసుకున్నది. అదేవిధంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డును సైతం ఈ పాట సొంతం చేసుకోవడం గమనార్హం. ఎమ్.ఎమ్ కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించాడు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ కలసి ఈ పాటను ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ స్వరాలు సమకూర్చాడు. ఈ పాటకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా రమా రాజమౌళి పనిచేసింది. ఇంతకుముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని ’జయహో’ పాటకు ఆస్కార్ వచ్చింది. దీనిని హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించారు. అమెరికాలోని లాస్ ఏంజిలస్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు సీని లెజెండ్స్ హాజరయ్యారు. 23 విభాగాల్లో ఈ సారి అవార్డులను ప్రకటించగా ’ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ అనే చిత్రం ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమదర్శకుడు, ఉత్తమచిత్రం, ఉత్తమనటి అవార్డులు ఆ చిత్రానికే దక్కాయి. ఇక మన దేశం నుంచి నామినేట్ అయిన త్రిబుల్ ఆర్ చిత్రం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ’నాటు నాటు’పాటకు ఆస్కార్ దక్కించుకుంది. మరోవైపు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం నుంచి ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ’ఆల్ దట్ బ్రీత్స్’ అవార్డును దక్కించుకోలేక పోయింది. శౌనకర్సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డు తుది జాబితాలో ఎంపికైంది. అయితే నవానీకి ఈ అవార్డు దక్కింది. కేటగిరీల వారీగా అవార్డు పొందిన చిత్రాల పూర్తి వివరాలు ఇలావున్నాయి. ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఎంపికయ్యింది. ఉత్తమ దర్శకుడు డానియెల్ క్వాన్, డానియెల్ ఫైరనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్), ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఆర్ఆర్ఆర్), ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), ఉత్తమ సహాయ నటి: జావిూ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), బెస్ట్ కాస్ట్యూమ్ డెజైన్: రూథ్ కార్టర్ (బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్), ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ది వెస్టన్ర్ ఫ్రంట్),ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్),ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టన్ర్ ఫ్రంట్ (జర్మనీ),డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : అలెక్సీ నవానీ,బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఎలిఫెంట్ విస్పరర్స్,బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టన్ర్ ఫ్రంట్), బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్),బెస్ట్ సౌండ్ : టాప్‌గన్: మావెరిక్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: ది వేల్, బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో,లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిష్ గుడ్‌బై,యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్, అండ్ ది హార్స్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్), ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టన్ర్ ఫ్రంట్)లకు దక్కాయి.