ప్రతిభ విద్యానికేతన్ లో అలరించిన ఫుడ్ ఫెస్టివల్ …
సామర్లకోటమార్చి8ఆంధ్రపత్రిక స్థానిక ప్రతిభ విద్యానికేతన్ లో మహిళా దినోత్సవం పురస్కరించుకుని హై స్కూల్లో ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్ ఎంతగానో ఆకర్షించింది ఈకార్యక్రమాన్నిబుధవారం స్థానిక ప్రతిభ విద్యానికేతన్ కరస్పాండెంట్ మరియు డైరెక్టర్ ఎస్ వి బి జి ప్రకాష్ మరియు సుధారాణి ప్రారంభించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రతిభా విద్యనికేతన్ కరస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ నేటి పరిస్థితులలో విద్యార్థులు తమ ఇండ్లలో తల్లిదండ్రులు తయారుచేసిన వంటకాలను రుచి చూడకుండా బయట మార్కెట్లో దొరికే ఫాస్ట్ ఫుడ్లు. వైపు మొగ్గుచూపుతున్నారని, దీని వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో రుచికరమైన ఆహారం అందుబాటులో దొరుకుతుందని వారు తెలుసుకొనే లాగా వంటకాలు తల్లిదండ్రులు చేయాలని సందర్భంగా తెలిపారు. పిల్లలకుఆరోగ్యకరమైనఆహారంపై అవగాహన కలిగించే ఉద్దేశంతో మహిళల యొక్క వంటింటి వంటకాలను రుచి చూపడానికి ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. యువత ఇష్టపడే రకరకాల పిండి వంటలు రకరకాల పండ్ల రసాలతో చేసిన మిల్క్ షేక్ లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన 254 రకాల పిండి వంటలు,జ్యూస్ లు ఎంతగానో అలరించాయి. వీటిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన వంటకాలకు ప్రకాష్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సునీత ఉపాధ్యాయుని ఉపాధ్యాయిని లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఫుడ్ పేస్ట్ లో పాల్గొన్నారు.