-డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు
కె.కోటపాడు,మార్చి12(ఆంధ్రపత్రిక):
అమ్మ జన్మనిస్తే ప్రాణపాయంవేళ పునర్జన్మనిచ్చేందుకు అత్యవసరమయ్యే రక్తంను దానంచేయడానికి
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం నిర్వహించడం ఆదర్శనీయమని డిప్యూటీ సిఎంబూడి ముత్యాల నాయుడు అన్నారు. మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆదివారం ఎ.కోడూరు జడ్పీహై స్కూల్లో మెగా రక్తదాన శిబిరంను నిర్వహించారు.ఈ శిబిరాన్ని డిప్యూటీ సిఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలపట్ల హర్షం వ్యక్తం చేసి ప్రసంశించారు.ట్రస్ట్ చైర్మన్ గొంప వెంకటరావు మాట్లాడుతూ మనప్రాంతంలో శస్త్రచికిత్సలు, ప్రమాదాలు జరిగినప్పుడు, గర్భిణుల ప్రసవాల వేళ అత్యవసర మైనప్పుడు ప్రాణాలు కాపాడటానికి రక్తందానం చేసేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదాతలకు, శిబిర నిర్వహణలో సాయపడినవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 58 మంది యువకులకు డిప్యూటీ సిఎం ముత్యాల నాయుడు ప్రశంసాపత్రాలను, మెమొంటోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ రెడ్డి జగన్మోహన్, జడ్పిటిసి సభ్యురాలు ఈర్లె అనురాధ, మాడుగుల నియోజకవర్గం టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, మండలంలో పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, హెచ్.ఎం.అనూరాధ, అమ్మ బ్లడ్ బ్యాంక్ ఎం. డి. వినోద్ బాలు, టీచర్ సూరెడ్డి బాబురావు, ఎన్.సి.సి. వింగ్ ప్రతినిధి లెక్కల ఎరుకునాయుడు, ట్రస్ట్ ఉపాధ్యక్షులు సింగంపల్లి అర్జున, కార్యదర్శి సింగంపల్లి అచ్చిబాబు, ట్రస్ట్ సభ్యులు ఆర్.కె.నాయుడు, సింగంపల్లి రామారావు, లెక్కల శ్రీధర్, లెక్కల కోటేశ్వరరావు , లెక్కల మధు, లెక్కల సత్యనారాయణ (రిటైర్డ్ టీచర్) తదితరులు పాల్గొన్నారు.