ప్రాజెక్ట్ కె షూటింగ్లో గాయపడ్డట్లు చిత్రబృందం వెల్లడి
షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై వెళ్లిన బిగ్ బి
ముంబయి,మార్చి 6 : బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్ కె’ షూట్లో ఆయనకు దెబ్బలు తగిలాయి.ఈ విషయాన్ని తన బ్లాగ్ వేదికగా బిగ్‌బీ తెలియజేశారు. గాయం కారణంగా తాను పాల్గొనాల్సిన షూట్స్ అన్నింటినీ వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. ఈ వీకెండ్లో అభిమానులను కలవలేకపోతున్నానని వెల్లడిరచారు.‘’ప్రాజెక్ట్ కె’ షూట్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్లో నేను గాయపడ్డాను. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. షూట్ రద్దు చేసుకుని వైద్యులను సంప్రదించాను. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్నాను. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండటంతో వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించారు. అందువల్ల పనులన్నింటినీ కొంతకాలంపాటు వాయిదా వేసి.. ముంబయిలోని ‘జల్సా’ (నివాసం)లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం అభిమానులను కలవలేకపోతున్నా’’ అని వెల్లడిరచారు.ప్రభాస్హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ చాలా వరకూ పూర్తైంది.